గద్దర్‌ అవార్డులు.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్‌

Gaddar Awards Megastar Chiranjeevi Responds Over CM Revanth Reddy Announcement

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రతి యేడాది ప్రభుత్వం తరపున ఇవ్వనున్న అవార్డులపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో కొత్తగా దివంగత ప్రజాకవి గద్దర్‌ పేరిట అవార్డులను ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ఆయన మంగళవారం రవీంద్రభారతిలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 93వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌దానోత్స‌వ‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనపై సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమ‌ని ఆయన పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సీఎం వ్యాఖ్యలపై స్పందించారు.

సోషల్ మీడియా వేదికగా గతంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన చిరంజీవి, ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కీలక సూచన చేశారు. సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని వారిని కోరుతున్నానంటూ మెగాస్టార్ ట్వీట్‌ చేశారు. ఇక తన పోస్టుకు తెలంగాణ సీఎంవోను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లను ట్యాగ్ చేశారు చిరంజీవి.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇక ఇదిలావుంటే, మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర ప్రేక్షకులముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.