ఊర్వశివో రాక్షసివో సినిమా తర్వాత అల్లు శిరీష్ కాస్త గ్యాప్ రెండేళ్ల తర్వాత బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. శామ్ ఆంటోని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. హీరోతో కలిసి అన్యాయాలను ఎదుర్కొనే టెడ్డీబేర్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో బడ్డీ చిత్రం వస్తోంది. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల మందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, ట్రైలర్ ను రిలీజ్ చేశారు కూడా. అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. ఇప్పటికే రన్ టైమ్ ను లాక్ చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సుమారు 2 గంటల 10 నిమిషాల రన్టైమ్తో ఈ చిత్రం రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ మరో అప్డేట్తో సర్ప్రైజ్ చేశారు. తాజాగా మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టెడ్డీబేర్‌తో అతడికుండే అనుబంధం చాలా క్యూరియాసిటీ పెంచుతోంది. మొత్తం ఫైట్ సీక్వెన్స్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా ప్రిషా సింగ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. తమిళ నటుడు అజ్మల్, అలీ ముఖేష్ రిషీ కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఆంటోని రూబెన్ ఎడిటర్ గా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ఈసినిమాతో అయినా అల్లు శిరీష్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























