నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరోయిన్ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ.. “సాయి దుర్గ తేజ్ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. అన్న అంటే నాకు చాలా గౌరవం. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమాతో తీరింది” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “సినిమా పట్ల ఆయన ఎంతో అంకితభావం వున్న వ్యక్తి. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్లో మంచి నటుడు, డ్యాన్సర్ వున్నాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ఎంతో థ్యాంక్స్. కాస్ట్యూమ్ ఈ రోజు అంత అందంగా వున్నయాంటే దానికి కారణం శామ్ అక్క. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని, నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























