మన్మథుడు, మల్లీశ్వరి సినిమాల పేర్లు చెప్తే మొదట గుర్తొచ్చే పేరు దర్శకుడు కె. విజయ్ భాస్కర్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన ఆయన తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. ‘ఉషా పరిణయం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్ భాస్కర్ తనయుడు కమల్ హీరోగా.. తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యపాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజా, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, కో-డైరెక్టర్ కాళీ, కాస్ట్యూమ్ డిజైనర్ శాన్వి తదిరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ భాస్కర్ అల్లుడు, నటుడు రవి శివ తేజ మాట్లాడుతూ.. “విజయ్ భాస్కర్ గారు ఆర్టిస్ట్ ఎవరైనా సరే పాత్రకు సరిపోతే వాళ్ల నుంచి నటనను రాబట్టుకుంటాడు. దటీజ్ ఆయన గ్రేట్‌నెస్. ఆ కాన్ఫిడెన్స్‌తోనే అందరూ కొత్తవాళ్లతో ఉషా పరిణయంను తీశాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ వున్నాయి” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం నా భార్య శాన్వి ఎంతో కష్టపడింది. తన నాన్న విజయ్‌భాస్కర్ ఇబ్బంది పడకూడదని ప్రొడక్షన్‌లో అన్నీ తానై చూసుకుంది. శాన్వీ నా వైఫ్ అయ్యినందుకు ఎంతో గర్వంగా వుంది. ఈ సినిమాలో నేను కూడా ఓ మంచి పాత్ర చేశాను. హీరోగా కమల్ ఇరగదీశాడు. ఇంతమంది కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందనే విశ్వాసం వుంది” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























