‘జైలర్‌ 2’లో నా పాత్ర ఎలా ఉంటుందంటే?

Kollywood Comedian Yogi Babu Reveals His Character in Jailer 2

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో తాను కనిపించనున్నట్టు తెలియజేశాడు ప్రముఖ కమెడియన్ యోగి బాబు. కాగా గతేడాది ఆగస్ట్ 10న విడుదలైన జైలర్ మూవీలో ఆయన తనదైన మార్క్ కామెడీతో అలరించిన విషయం తెలిసిందే. రజినీతో కలిసి యోగి బాబు చేసిన అల్లరి థియేటర్లలో నవ్వులు పూయించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లు వసూళ్లు సాధించింది. తెలుగులోనూ ఈ సినిమా అదరగొట్టింది. మొత్తంగా ‘రోబో 2.0’ తర్వాత రజినీకి మళ్ళీ ఆ స్థాయి హిట్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో జైలర్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా జైలర్‌ 2లో తన పాత్రను గురించి వివరించాడు యోగి బాబు. ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉండనుందని, ఈ మేరకు డైరెక్టర్ నెల్సన్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడన్నాడని తెలిపాడు. ఇక మరోవైపు ఫస్ట్‌ పార్టులో కనిపించిన మిర్నా మీనన్‌ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నట్టు ఇటీవలే ఒక హింట్ ఇచ్చింది. ఇక ఈ రెండు అప్‌డేట్స్‌ వచ్చాక సూపర్ స్టార్ అభిమానులు ఇంకో హిట్ పక్కా అంటూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినాయకన్, రమ్య కృష్ణన్, వసంత్ రవి మరియు తమన్నా భాటియా కూడా కీలక పాత్రలు పోషించారు. కాగా ‘జైలర్‌’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ మరియు బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ క్యామియో రోల్స్‌లో కనిపించడం విశేషం. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.