నాన్న గారు నాకు దేవుడు, ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తా

Usha Parinayam Hero Sree Kamal Thanks To His Father Cum Director Vijaya Bhaskar

మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి సినిమాల పేర్లు చెప్తే మొదట గుర్తొచ్చే పేరు ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌ భాస్క‌ర్. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించడంలో సిద్ధహస్తుడైన ఆయన తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రూపొందించారు. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌ భాస్క‌ర్ తనయుడు క‌మ‌ల్‌ హీరోగా.. తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్యపాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఉషా ప‌రిణ‌యం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవలే నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు శివాజీ రాజా, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కెమెరామెన్‌ సతీష్‌ ముత్యాల, కో-డైరెక్టర్‌ కాళీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శాన్వి తదిరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ ‘అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్‌ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాను. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. సాయి అన్నరావడం నా జీవితంలో మరిచిపోలేను. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్‌ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఇంకా ఆయన ఇలా చెప్పారు.. “నాన్న గారు నాకు దేవుడు. ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్‌ నో ప్రాబ్లమ్‌ గర్ల్‌. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.