అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ సినిమా శివం భజే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం.. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలు క్యూరియాసిటీ ని పెంచాయి. దీంతో ఈసినిమా అశ్విన్ బాబుకు హిట్ ను ఇస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భారీ అంచనాల మధ్య ఈసినిమా ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ లో కూడా ఈసినిమాకు మంచి డిమాండ్ పెరిగింది. అక్కడ ఈ సినిమాను వర్ణిక విజువల్స్ సంస్థ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. జూలై 31న ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్రీమియర్స్ వేయనున్నారు.
కాగా అప్సర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గంగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు వికాస్ బడిస సంగీతం, దాశరథి శివేంద్ర సినిమాచోగ్రఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































