కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్.. 1,000 మంది ఆర్టిస్టులతో

Nandamuri Kalyan Ram's NKR21 Intense Climax Shoot Completed with 1000 Artists

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ‘అమిగోస్’, ‘డెవిల్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. #NKR21 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీ గురించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. NKR21 చిత్రం క్లైమాక్స్ పూర్తయినట్టు సమాచారం. ఈ క్లైమాక్స్ షూటింగ్‍లో 1,000 మంది ఆర్టిస్టులతో భారీగా రూపొందినట్టు తెలుస్తోంది. ఇక సినిమా ప్రారంభంలో ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో 33 సెకన్ల నిడివిగల ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

కాగా ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి IPS ఆఫీసర్‌గా కమాండింగ్ క్యారెక్టర్‌లో తన డైనమిక్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోనున్నారు. అలాగే సోహైల్ ఖాన్, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న #NKR21 సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మరియు అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ బలుసు, అశోక్ ముప్పాలతో కలిసి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ముప్పా వెంకయ్య చౌదరి సమర్పిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.