పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా గురించి హరీష్ శంకర్ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉన్నారు.. ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈసినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా ఈ సినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే చిత్రబృందం పలు మీడియా సమావేశాల్లో, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్యాన్స్ కు ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది.. అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి అని చెప్పుకొచ్చారు. మరి పవన్ రాజకీయాల నుండి కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.
ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























