ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం దక్కింది. 800కు పైగా చిత్రాల్లో నటించడంతోపాటు 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా పనిచేసిన భరణి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ‘సముద్రం’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను గెలుచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు మరో గౌరవం లభించింది. తెలంగాణలోని వరంగల్ ఎస్‌ఆర్ యూనివర్సిటీ తాజాగా ఈ సీనియర్ నటుడికి గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆగస్ట్ 3వ తేది, శనివారం వరంగల్‌లో జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవ వేడుకలో తనికెళ్ల భరణికి ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. కాగా ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఇంతకుముందు ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
ఇక తనకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల నటుడు తనికెళ్ల భరణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు డాక్టరేట్ రావడం పట్ల నా కుటుంబ సభ్యులు, అభిమానులు చాలా ఆనందపడ్డారు. నాకు కూడా ఇది చాలా సర్‌ప్రైజింగ్ విషయం. ఎందుకంటే నేను అస్సలు ఊహించలేదు. యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు ఇలా డాక్టరేట్ ప్రకటిస్తున్నాం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వాస్తవానికి ఆ రోజున నేను డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారి సినిమా షూటింగ్ కోసం వైజాగ్ లో ఉంటున్నా. అయితే విషయం తెలియగానే మోహనకృష్ణ ఇమ్మీడియేట్ గా సెలవు ఇచ్చేశారు. ఫస్ట్ టైమ్ డాక్టరేట్ రావడంతో నాకు మంచి అనుభూతికి లోనవుతున్నా. ఇలాంటి గౌరవం నాకు రావడం ఆలస్యం అయిందని చాలామంది అన్నారు. కానీ, ఆలస్యంగా అయినా సరే, నా ప్రయత్నం లేకుండా వచ్చినందుకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.
“మా గురువు గారి రాళ్ళపల్లి (దివంగత ప్రముఖ నటుడు) ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టే ఇది నాకు దక్కింది అనుకుంటున్నా. ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా అభిమానులు.. వీరందరూ న పట్ల చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. డాక్టరేట్ అందుకున్నాక అందరినీ కలుస్తాను” అని తనికెళ్ళ భరణి చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























