నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బీజీగా ఉంది. దీనిలో భాగంగానే పలు అప్ డేట్లు ఇస్తున్నారు. రీసెంట్ గానే నివేదాకు సంబంధించి 35 సెకన్ల గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో విశ్వదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తన పాత్రకు సంబంధించి 35 సెకన్ల గ్లింప్స్ ను విడుదల చేశారు. విశ్వదేవ్ ను కేరింగ్ అండ్ రెస్పాన్స్ బుల్ మిడిల్ క్లాస్ ఫాదర్ గా ప్రజెంట్ చేసిన ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగా వుండి ఆకట్టుకుంది.
ఇప్పుడు మరో పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో అరుణ్ శర్మ మరో పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా తన పాత్రకు సంబంధించి 35 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇన్నోసెన్స్, నాటీనెస్ తో ఉన్న అరుణ్ శర్మ గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈసినిమా ఒకేసారి విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























