ఓదెల 2- బోనాల స్పెషల్ గా తమన్నా పోస్టర్ రిలీజ్

tamanna bhatia special poster released from odela 2 movie

ఈ సినిమాలో త‌మ‌న్నా శివ‌శ‌క్తి అనే పాత్ర‌లో.. మహదేవ్‌కు పరమభక్తురాలిగా క‌నిపించ‌నుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు.ఇక గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇంకా ఇతర కీలక పాత్రలతో పాటు దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన తమన్నా ఫస్ట్ లుక్, టీజర్, బిహైండ్ ద సీన్స్ వీడియో మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో బోనాల సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఈసినిమా నుండి పండుగ‌ శుభాకాంక్ష‌లు తెలుపుతూ తమన్నా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త‌మ‌న్నా బోనంఎత్తుకుని వ‌స్తున్న‌ట్లు ఉన్న పోస్ట‌ర్ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.