యాక్షన్ కింగ్ అర్జున్… దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈయన మెప్పించారు. మరోసారి తనదైన శైలిలో మరో విభిన్నమైన పాత్రతో ‘విడాముయర్చి’లో ఆకట్టుకోబోతున్నారాయన. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయర్చి’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ను అర్జున్ నిలబడి ఉన్నారు. బ్యాగ్రౌండ్లో అజిత్ షాడోలో కనిపిస్తున్నారు. అసలు అర్జున్‌కి, అజిత్ పాత్రకు ఉన్న లింకేంటనే ఆసక్తిని పోస్టర్‌తో క్రియేట్ చేశారు మేకర్స్. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాకం మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలు, డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్..‘విడాముయర్చి’ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఆద్యంతం ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో పాటు విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా పేరున్న మగిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అజిత్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్, త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్ త్రయం తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్పటికే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేస్తున్న ‘విడాముయర్చి’ సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























