హీరో క్యారెక్టరైజేషన్, టేకింగ్, విజువల్స్, మ్యూజిక్ పరంగా ‘మిరపకాయ్’ కంటే ‘మిస్టర్ బచ్చన్’ హండ్రెడ్ టైమ్స్ బావుటుందని పేర్కొన్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ మేరకు ఆయన తాజాగా మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తాను దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ఎక్సప్లోజివ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన షోరీల్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా, మొదటి రెండు పాటలు సినీప్రియులను అలరించాయి. ఇక తాజాగా మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. దీనికి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని నాస్టాల్జిక్ చార్మ్ గా మలిచినట్టు అర్ధమవుతోంది. దీంతో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన Q&A ప్రెస్మీట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలా సమాధానాలు ఇచ్చారు.
హరీష్ గారు.. మీరు చేసే రీమేక్స్ లో చాలా మంచి మార్పులు చేస్తారు.. ఇందులో ఎలాంటి యాడ్ ఆన్స్ వుంటాయి?
80, 90s మధ్య జరిగేకథ ఇది. కొంచెం పొయిటిక్ గా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, చేతక్ స్కూటర్లు, కుమార్ షాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. ఫస్ట్ హాఫ్ లో చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ వుంటాయి.
హరీష్ గారు.. మీ డైలాగ్స్ మీ యాటిట్యూడ్ కి రిలేట్ అయ్యేలా వుంటాయి కదా.. ఇలా ముందే అనుకుంటారా?
ఎవ్వరైనా పొద్దున్న లేచి అద్దం చూసుకొని ‘నేను హీరో’ అనే బయలుదేరుతారు కదా (నవ్వుతూ)..
హరీష్ గారు ఇందులో గెస్ట్ అప్పీరెన్స్ చేశారా? ఇందులో రవితేజ గారిని అమితాబ్ ఫ్యాన్ గా ఎలా చూపించబోతున్నారు?
-చేశాను. అది పోస్టర్ వరకే పరిమితం (నవ్వుతూ).. ఇందులో బచ్చన్ గారిని భెస్ చేసుకొని చాలా మంచి ఐటమ్స్ వున్నాయి. అవి స్క్రీన్ మీద చూస్తే బావుటుంది.
హరీష్ గారు.. మిరపకాయ్ లో రవితేజ గారిని చాలా అద్భుతంగా చూపించారు. మిస్టర్ బచ్చన్ దానికంటే అద్భుతంగా ఉంటుందా?
నిన్న చేసిన సినిమా కంటే ఈ రోజు చేసిన సినిమా బెటర్ గా వుండాలని ఎవరైనా కోరుకుంటాం. అప్పటికి ఇప్పటికి నాకు చాలా ఎక్స్ పీరియన్స్ వచ్చింది. ఈ సినిమా టేకింగ్ పరంగా, విజువల్, మ్యూజిక్, హీరో క్యారెక్టరైజేషన్ పరంగా మిరపకాయ్ కంటే మిస్టర్ బచ్చన్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా వుంటుంది.
నా కెరీర్ ఫాస్టెస్ట్ సినిమా ఇది. దీనికి కారణం మా నిర్మాత విశ్వప్రసాద్ గారు. 78 రోజుల షూటింగ్ లో ఏ రోజు ఇబ్బంది పడలేదు. మేము అడిగినదాని కంటే ఎక్కువ ఇచ్చారు.
మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడానికి కారణం మీరు, రవితేజ గారు అమితాబ్ ఫ్యాన్ కావడమేనా?
చాలా మందికి ఫ్యాన్స్ గా వుంటాం, అన్ని పేర్లుపెట్టలేం కదా. కథపరంగా చిన్న పిట్టకథ వుంటుంది, అందుకు ఈ టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ పెట్టింది కూడా రవితేజ గారే.
హరీష్ గారు.. రవితేజ మీ కాంబినేషన్ అంటే అంచనాలు వుంటాయి ? ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ అందుకునేలా ఉంటుందా?
ఆ అంచనాలుని అందుకోవడానికి చాలా కష్టపడ్డాం. సినిమా చూసిన తర్వాత ఆ అంచనాలని దాటేసాం అని మీరే అంటారు. ఎంటర్ టైన్మెంట్ చాలా ఎక్కువ వుంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























