మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . తెలుగులో మహానటి సినిమాతో పరిచయమైన దుల్కర్ ఆ సినిమాలో నిడివి చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన సీతా రామం తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, “శ్రీమతి గారు” పాట విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విడుదలైంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాట మనల్ని 1980-90ల రోజుల్లోకి తీసుకెళ్తోంది. వాయిద్యాలు వినియోగించిన విధానం, ముఖ్యంగా లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ గాత్రం.. ఈ గీతాన్ని ఓ కమ్మటి విందు భోజనంలా మలిచాయి. శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా అంటూ వచ్చిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫి.. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























