నూతన నటీనటులతో మత్స్య కారుల జీవన నేపథ్యంలో హరినాథ్ పులి దర్శకత్వం వహించిన చిత్రం ‘రేవు’. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. నిర్మాణ పర్యవేక్షకుడిగా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రేవు రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదలచేశారు. కాగా ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌ను మిల్కి బ్యూటీ తమన్నా, డైనమిక్ డైరెక్టర్ సంపత్ నంది చేతులమీదుగా విడుదల చేయడం విశేషం. దీనికి ఓదెల 2 సెట్స్ వేదికయింది. ఈ కార్యక్రమంలో హీరో వసిష్ఠ సింహ, మధు క్రియేషన్స్ అధినేత మధు.డి, డైరెక్టర్ అశోక్ తేజ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్‌లు కూడా పాల్గొన్నారు. అలాగే రేవు హీరో వంశీ, హేమంత్, ప్రముఖ పారిశ్రామిక వేత్త పారుపల్లి అనీల్, BDL నగేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. రేవు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉంది, రేవు రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంది అని అన్నారు. ఈ సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబుకు ఆల్ ద బెస్ట్ అని చెప్పారు తమన్నా.
డైరెక్టర్ సంపత్ నంది మట్లాడుతూ.. నా మిత్రులైన డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. రేవు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చెయ్యాలని అడిగినప్పుడు ఓదెల 2కి సంబందించిన పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామం మల్లిఖార్జున దేవాలయం షూటింగ్ సెట్‌కి వారిని ఆహ్వానించి తమన్నాతో ఆగష్టు 9న రిలీజ్ అవుతున్న రేవు పోస్టర్ లాంచ్ చేయించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































