మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్..తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశారీ అగ్ర కథానాయకుడు. తెలుగులోనూ మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఈయన అలరించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలోనూ దుల్కర్ అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెలుగులో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో తెలుగు సినిమాకు పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం కోసం ఆయన యూనిక్ మూవీస్, విలక్షణమైన కథాంశాలతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న పవన్ సాధినేనితో చేతులు కలిపారు. ఈ మేరకు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ పెడుతున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ మూవీ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా కనిపిస్తున్నారు. అదే పోస్టర్లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండటాన్ని చూడొచ్చు. దుల్కర్ మరో డిఫరెంట్ రోల్‌తో అలరించబోతున్నారనే విషయం పోస్టర్ ద్వారా స్పష్టమైంది. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. హృదయాన్ని హత్తుకునే ఎంటర్టైనర్గా సినిమా మెప్పించనుందనే విషయం స్పష్టమవుతుంది.
కాగా టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాలతో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు ఈ మూవీ నిర్మాణంలో భాగమవుతుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఆకాశంలో ఒక తార కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























