మిస్టర్ బచ్చన్- రవితేజ్ డబ్బింగ్ కంప్లీట్

ravi teja completed his dubbing for mr bachchan movie

రవితేజ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈసినిమా బాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు రాగా ఈ వార్తలకు హరీష్ శంకర్ స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుస అప్ డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈసినిమా నుండి వరుసగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. సితార అంటూ వచ్చిన ఫస్ట్ సాంగ్, రెప్పల్ డప్పుల్ అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ రెండూ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి మరో సాలిడ్ అప్ డేట్ తో వచ్చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులతో బిజీగా ఉండగా తాజాగా రవితేజ తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇదే విషయాన్ని చిత్రయూనిట్ తమ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.