మాస్ మాహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో వీరిద్దరి కంబినేషన్లో వచ్చి షాక్, మిరపకాయ్ సినిమాలు వచ్చాయి. వాటిలో మిరపకాయ్ సినిమా సూపర్ హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై మొదటినుండీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికితోడు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సితార, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ ఎలా ఉందంటే..
టీజర్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, రవితేజ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటున్నాయి. రవితేజ యూత్ ఫుల్ ఎనర్జీ, చార్మ్ తో స్క్రీన్ పై అద్భుతమైన మార్క్ వేశారు. ఇంకా రవితేజ హీరోయిన్ భాగ్య శ్రీ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తుంది. రవితేజ, జగపతి బాబుల మధ్య జరిగిన ఘర్షణను ప్రజెంట్ చేసింది. జగపతి బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ పాత్రలు హ్యుమర్ కి హింట్ ఇస్తున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి.. వస్తుంటాయి, పోతుంటాయి.. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. పోయేదాకా మనతోనే ఉంటుంది అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ అలరిస్తుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
కాగా ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























