పారిస్‌ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన మెగాస్టార్ దంపతులు

Megastar Chiranjeevi Holds Olympic Torch Replica Along with Wife Surekha in Paris

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సినిమా షూటింగులతో, ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంటుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన రొటీన్ లైఫ్‌కి కొంచెం విరామం ప్రకటించారు. తాజాగా ఈ మెగా హీరో ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్‌కి వెళ్లారు. శుక్రవారం నుంచి పారిస్‌లో సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. సతీమణి సురేఖతో కలిసి ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరంజీవి దంపతులు ఒలింపిక్ టార్చ్ రెప్లికాను పట్టుకుని ఫోటోలు దిగారు. అనంతరం చిరు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. “పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగిన మన భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి, ఆల్ ది వెరీ బెస్ట్. ఎక్కువ మెడల్స్ గెలవాలని కోరుకుంటున్నాను! గో ఇండియా!! జై హింద్” అని అందులో పేర్కొన్నారు.

కాగా విశ్వక్రీడలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకుల కోసం నిర్వాహకులు ఒలింపిక్స్ టార్చ్ ప్రతిబింబం (రెప్లికా) ఒకటి తయారుచేసి అందుబాటులో ఉంచారు. ఈ రెప్లికాని పట్టుకొనే చిరంజీవి, సురేఖలు ఫోటోలు దిగారు. ఇక ఈ సందర్భంగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేశారు చిరంజీవి. ఒలింపిక్స్‌లో మన దేశానికి ఎక్కువ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.