దేవర సెకండ్ సాంగ్ హింట్

jr ntr devara movie second song update

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా దేవర. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకపక్క షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ గా పూర్తిచేస్తున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫియర్ సాంగ్ అంటూ వచ్చిన ఈపాట ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే కదా. అనిరుథ్ కంపోజ్ చేసిన ఈపాట ఫిరోషియస్ గా ఉండి మంచి వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ కు సంబంధించి హింట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న టీ సీరిస్ వారు తమ ట్విట్టర్ ద్వారా దేవర సాంగ్ కు సంబంధించి హింట్ ను ఇచ్చారు. అంతేకాకుండా లవ్ సింబల్ ఉన్న స్టికర్స్ పెట్టడంతో సెకండ్ సాంగ్ లవ్ సాంగ్ అయి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.