జపానీస్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

hanuman movie japan subtitle version release date fixed

ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలను ఇతర దేశాల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి డిమాండే పెరిగింది. ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలు అక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతుండేవి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత మన హీరోలకు కూడా బాగానే క్రేజ్ పెరిగింది. ఇప్పటికే అక్కడ రిలీజ్ అయిన బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్, సలార్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలను కూడా అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్దమయింది. ఆసినిమా మరేదో కాదు ఈ ఏడాది సంక్రాంతికి బరిలో దిగి బ్లాక్ బస్టర్ ను అందుకున్ హనుమాన్ మూవీ. ప్రశంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనతో వచ్చారు మేకర్స్. తెలుగు వర్షన్ నే జపనీస్ సబ్ టైటిల్స్ తో హనుమాన్ సినిమాని జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు. అక్టోబర్ 4న జపాన్ లో హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతుందని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా ప్రీ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో కూడా తేజ సజ్జానే హీరోగా నటిస్తుండగా.. భారీ తారాగణాన్నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.