స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా? ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి? కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? చివరకు వారు కలిశారా? అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్‌లో వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. చిన్నప్పటి నుంచి కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఓ ఊరిలో ఉండే కుర్రాళ్లంతా పెరిగి పెద్దవుతారు. ఊరి జాతరను ఘనంగా జరుపుకునే ఆ ఊర్లో కులాలు, మతాలంటూ గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎంత వరకు వెళతాయంటే స్నేహితులు ఒకరినొకరు తిట్టుకునేంత వరకు, ఒకరినొకరు కొట్టుకునేంత వరకు.. వీరి గొడవలకు భయపడి ఊర్లో జాతర జరుపుకోవాలంటే భయపడుతుంటారు.
ఆ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చక్కగా ఆవిష్కరించారు. ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా మంచి డైలాగ్స్‌తో సినిమాను ఆవిష్కరించారు. సన్నివేశాలు చూస్తుంటే చాలా సహజ సిద్ధంగా అనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌తో స్నేహం గొప్పదనాన్ని తెలియజెప్పటానికి ఫ్రెండ్స్ ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























