చిత్ర పరిశ్రమలో గీత రచయితలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సినిమాలలో పాటలకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఒక పాట ఎక్కువమందికి చేరడంలో సంగీతం ఎంత కీలకమో సాహిత్యం కూడా అంతే ముఖ్యం. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే.. మన తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ ఎందరో దిగ్గజ పాటల రచయితలు ఉన్నారు. దివంగత వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహిత్యాన్ని ఉన్నత స్థానంలో నిలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ ఇద్దరు ఉద్దండుల తర్వాత చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్ తదితరులు ఆ ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరితోపాటుగా కొత్తగా కాసర్ల శ్యామ్ వంటి మరికొందరు యువ గేయ రచయితలు తమ రచనలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా చంద్రబోస్ అయితే.. మన తెలుగు పాట స్థాయిని అంతర్జాతీయ వేదికపై కూడా నిలిపారు. ఆయన రచించగా, ఎంఎం కీరవాణి స్వరపరిచిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రముఖ గీత రచయితలు ఒకేచోట కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా కనిపిస్తే మాత్రం సినీ ప్రియులకు, అభిమానులకు పండుగే. తాజాగా ఈ రచయితలందరూ ఒకే చోట కనిపించి సందడి చేశారు. ఈ అపురూప ఘట్టానికి వేదికయింది ‘రేవు’ చిత్రం ఆడియో లాంచ్ వేడుక. ఈ సినిమా పాటల ఆవిష్కరణకు ఈ సాహితీ కారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా ఈ చిత్రంలోని పాటలను ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గీత రచయితలుగా వెలుగొందుతున్న చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్.. ఇలా వీరందరూ ఒకే వేదికపై, ఒకే ఫోటోలో కనిపించారు. దీంతో ప్రముఖ గీత రచయితలందరిని ఒకే వేదికపై చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతమంది ఒకేచోట కనిపించడంతో సంతోషం వ్యక్తం చేశారు. కాగా నూతన నటీనటులతో మత్స్య కారుల జీవన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకత్వం వహించాడు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























