తంగలాన్‌.. సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

Thangalaan Completes Censor Formalities and Certified with UA

కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తంగలాన్’. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్‌గా తెరకెక్కుతోంది. బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి తిరుతిరువోతు, ప‌శుప‌తి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విక్ర‌మ్ ట్రైబల్ లీడ‌ర్‌గా స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో తంగలాన్ నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో తంగలాన్ విడుదలకు సిద్ధమైంది. జూన్‌ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే మేకర్స్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.