మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘సితార్’ పాట క్లాసికల్ అనిపించుకుంది. లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య స్టీమీ రొమాన్స్ తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ నుంచి గురువారం సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే ప్రకటించినట్టు ‘రెప్పల్ డప్పుల్’ అంటూ సాగే లిరికల్ వీడియో నేడు విడుదలైంది. ఈ పాటకు మిక్కీ జె మేయర్ స్వరాలు అందించగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ సాంగ్‍ను అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ ఆలపించగా.. ఫుల్ మాస్ బీట్‍తో మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























