పొలిమేర 3 నిర్మాత చేతిలో కిరణ్ అబ్బవరం క రిలీజ్ హక్కులు

vamsi nandipati acquired kiran abbavaram ka movie ap and telangana release rights

చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు కిరణ్ అబ్బవరం. దీంతో ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా క (కిరణ్ అబ్బవరం). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమా అప్ డేట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ముందుగా సినిమా టైటిల్ ను ప్రకటించారు. క (కిరణ్ అబ్బవరం) అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చారు. ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సాలిడ్ గా జరిగినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత సొంతం చేసుకున్నట్టు తెలిపారు. పొలిమేర3 నిర్మాత వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు.

కాగా శ్రీ చక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణతో కలిపి కిరణ్ అబ్బవరం కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమాతో అయినా కిరణ్ మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.