రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కథ కూడా రాయడం కంప్లీట్ అయిపోగా.. మహేష్ కూడా తన పూర్తి ఫోకస్ ను ఇప్పుడు రాజమౌళి సినిమాపై పెట్టేశాడు. ఈసినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి తన తరువాత సినిమా అన్ని సినిమాలకు బాప్‌గా ఉండబోతుందని అన్నారు. అంతేకాాదు ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు.. ఈసినిమా ఊహాలకు అందని విధంగా ఉండబోతుందని అనుకుంటున్నాను అని తెలిపారు. రాజ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలతో రాజమౌళి-మహేష్ సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
కాగా అఫికల్ అడువుల నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈసినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























