మార్వెల్ మూవీ యూనీవర్స్ లో మరో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగించేందుకు రెడీ అయింది. డెడ్‌పూల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్’ చిత్రం వస్తోంది. ఈ చిత్రంలో వోల్వరిన్‌గా హ్యూ జాక్మెన్, డెడ్‌పూల్‌గా రయన్ రెనాల్డ్స్ కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్‌కు వరల్డ్ వైడ్ విపరీతంగా క్రేజ్ ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మార్వెల్ టీమ్ ఈ సినిమాను అన్ని భాషల్లో ఉన్న సినీ అభిమానులను మరింత అలరించే విధంగా తీర్చిదిద్దేందుకు డబ్బింగ్ వెర్షన్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులోనూ ఈ సినిమా డబ్బింగ్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న పదాలను ఉపయోగించారు.
తెలుగు సినీ అభిమానులను ఇటీవల ఉర్రూతలూగించిన ‘కుర్చీ మడతపెట్టి’, ‘కెవ్వు కేక’, ‘రింగ రింగ’.. ఇలా అనేక ఇలా అనేక పదాలతో డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ తెలుగు వెర్షన్ సిద్ధం అయింది. యూత్ మధ్య విపరీతంగా వినిపించే పదాలతో ఉన్న ఈ డైలాగ్స్ సినిమాకు హైలెట్ అవ్వనున్నాయి. డెడ్‌పూల్ మరియు వోల్వరిన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ట్రెండింగ్ డైలాగ్‌లతో ఆన్లైన్లో ట్రెండ్ అవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.
ఇక ఈ సినిమాలో సూపర్ హీరో డెడ్పూల్తో పాటు మిలీనియమ్ సూపర్ హీరో ఎక్స్మెన్లో మోస్ట్ ఫెవరేట్ వోల్వరిన్ కూడా సిల్వర్ స్రీన్‌పై ఫైట్లు చేయబోతున్నాడు. దీంతో ఒకేసారి ఇద్దరు హీరోలు చేయబోయే అద్భుతమైన విన్యాసాలను మూవీ లవర్స్ డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ ద్వారా వీక్షించబోతున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా మూవీ లవర్స్ ముందుకు వస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























