మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒక్కడు స్పెషల్ షోస్

Superstar Mahesh Babu's Okkadu Special Shows in Selected Theatres on August 8th

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి చేరింది. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘ఒక్కడు’ ప్రస్తుతం రీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ కల్ట్‌ యాక్షన్ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 9 మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ముందురోజు ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవుతోంది. అయితే ఇది కేవలం ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్లలోకి రాబోతోంది. ఆగస్టు 8న రాత్రి 9:30 గంటలకు స్పెషల్ షోలు వేయనున్నారు. ఇక ఆగస్టు 9న మహేష్ బాబు కెరీర్‌లో తొలి సూపర్ హిట్ ఫిల్మ్ ‘మురారి’ కూడా రీ రిలీజ్ అవనుంది. దీంతో తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక ఇదిలావుంటే, మహేష్ బాబు తదుపరి సినిమా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. #ఎస్‌ఎస్‌ఎంబీ29గా వ్యవహరిస్తున్న ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో ట్రెజర్ హంట్ కథాంశంతో ఉంటుందని సమాచారం. ఇందుకోసం మహేష్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. ఇప్పటికే స్పెషల్ ఫిట్‍నెస్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆయన జర్మనీకి వెళ్లి వచ్చారు.

సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ నటించనున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తలకు సంబంధించి దర్శకుడు రాజమౌళి త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా యాక్షన్ అడ్వెంచరస్‌గా పాన్ గ్లోబల్ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.