నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) ‘రాయన్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ రాయన్ సినిమా గురించి హీరో ధనుష్‌తో తనకున్న అనుబంధం గురించి వివరించారు. సందీప్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ముందుగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాని పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. 14 ఏళ్ళుగా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ధనుష్ అన్న రాయన్ సినిమాలో నన్ను యాక్ట్ చేయమని అడిగినప్పుడే అదొక అవార్డ్ లానే ఫీల్ అయ్యా. ధనుష్ అన్న నాకు ఒక బ్రదర్ అండ్ గురువు లాంటి వారు.”
“ధనుష్ అన్న తన 50వ సినిమాలో తనకోసం రాసుకున్న క్యారెక్టర్‌లో నన్ను యాక్ట్ చేయమని ఆయన డైరెక్ట్ చేశారు. ఇంతకంటే నాకు గొప్ప అవార్డ్ వుండదు. ఈ సినిమా చూసి ఒక తెలుగు హీరో తమిళ్‌లో ఇంత మంచి క్యారెక్టర్ చేయగలిగాడని ఆడియన్స్ అంతా చాలా గర్వంగా ఫీలౌతారు. ‘కెప్టన్ మిల్లర్’ ఫినిష్ అయ్యాక రాయన్ షూట్‌కి వెళ్లాం. ఈ షూటింగ్ మరచిపోని అనుభూతిని ఇచ్చింది. చాలా కష్టమైన క్యారెక్టర్ అని ధనుష్ ముందే చెప్పారు. నా హెయిర్ స్టైల్ కూడా ఆయనే సెట్ చేశారు.”
“ఆయన ఓ సీన్‌ను సింగిల్ టేక్‌లో పూర్తి చేశారు. కానీ నేను 11 సెకన్ల లెంత్ వున్న సీన్ కి 16 టేక్స్ తీసుకున్నా. తర్వాత, మిగిలిన వారంతా రీ టేక్స్ తీసుకోవడంతో నా భయం పోయింది (నవ్వుతూ). నన్ను తన పక్కన కూర్చోపెట్టుకుని ధనుష్ అన్న కొత్త విషయాలు నేర్పించారు. జీవితంలో ఇలాంటి అవకాశం మరోసారి రాదేమో. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్లినా ఇలాంటి యాక్టింగ్ కోర్స్ నేర్చుకోలేం. ఒక నటుడికి ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన ధనుష్ అన్నకి థాంక్ యూ.”
“ప్రకాష్ రాజ్ గారితో కలసి నటించడం కూడా గొప్ప అనుభూతి. రెహ్మాన్ గారు నాకో పాటిచ్చారు. సన్ పిక్చర్స్‌కి థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాయన్ అద్భుతమైన సినిమా. ధనుష్ గారు యాక్టర్ గా నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా నేషనల్ అవార్డ్ గెలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























