హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు. ఇక ఇన్ని రోజులు సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను కూడా తాజాగా ప్రకటించారు మేకర్స్. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ అన్న వార్తలు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు దీనిపై క్లారీటి ఇచ్చాడు హరీష్ శంకర్. తాజాగా ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ హరీష్ శంకర్ ను ఉద్దేశిస్తూ.. సార్ నాదొక రిక్వెస్ట్. ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలని ఆశిస్తున్నా. మీలో మంచి రైటర్ ఉన్నాడు. సొంత కథలతో మీరు మ్యాజిక్ చేయగలరు. ‘మిరపకాయ్’, ‘షాక్’లాంటి సినిమాలు ఇంకా నా మదిలో ఉన్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్‌కు ఆల్ ది బెస్ట్ సర్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కు హరీశ్ శంకర్ రిప్లై ఇస్తూ.. ఈ సినిమా చూశాక నువ్వు రీమేక్ అని ఫీలైతే అప్పుడు మాట్లాడుకుందాం బ్రదర్. నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ డైరెక్టర్‌ని. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని తెలిపాడు. ప్రస్తుతం ఈట్వీట్ వైరల్ అవుతుంది.
కాగా ఈసినిమాలో ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























