విశ్వంభర టాకీ పార్ట్ కంప్లీట్

Vishwambhara talkie part is wrapped

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది.ఇంకో రెండు సాంగ్స్ అలాగే క్లైమాక్స్ ఫైట్ బ్యాలెన్స్ వుంది.సాంగ్స్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి అలాగే ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించాల్సి వుంది. ఇంట్రో సాంగ్ కంపోజ్ కూడా పూర్తి అయ్యింది. సినిమాలో మొత్తం 5 పాటలు వుండనున్నాయి.ఇందులో ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ జరిగిపోయింది.ఇక  క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కు అనల్ అరసు నేతృత్వం వహించనున్నారు.ఆగస్టు లో ఈ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ కానుంది.అదే నెల 22న చిరంజీవి బర్త్ డే కావడంతో ఆరోజున ఈ సినిమా అప్డేట్ రానుంది.టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వశిష్ఠ డైరెక్షన్ లో సోషియో ఫాంటసీగా తెరకెక్కతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇషా చావ్లా ,సురభి,అషికా రంగనాథ్ చిరు చెల్లెళ్ళు గా నటిస్తున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది జనవరి 10న భారీ అంచనాల మధ్య  విడుదలకానుంది..  

ఇక ఈసినిమా తరువాత చిరు చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది.రేస్ లో మాత్రం చాలా మంది డైరెక్టర్లు వున్నారు.మరి తన 157 సినిమాకు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.చిరంజీవి పుట్టిన రోజున ఈసినిమాపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.