కల్కి ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే

Kalki 2898 AD OTT Release Update

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి భారీ అంచనాల మధ్య విడుదలై గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

దీంతో కల్కి కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ నేపథ్యంలో కల్కి చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కల్కి సినిమా ఓటీటీ లోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది.

కాగా కల్కి ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న క్రమంలో ఇప్పుడే ఓటీటీ లోకి తీసుకురావడానికి మేకర్స్ అంత సుముఖంగా లేరని అంటున్నారు. సూపర్ హిట్ అయిన చిత్రాలను థియేటర్లలో విడుదలైన పది వారాల తరువాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని గతంలో టాలీవుడ్ నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం మేరకు కల్కి మూవీని పది వారాల తరువాతే ఓటీటీలోకి తీసుకురావడానికి వారు నిశ్చయించుకున్నారని సమాచారం. సో.. కల్కిని ఓటీటీలో చూడాలంటే, మరికొంతకాలం ఆగక తప్పదు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్‌ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.