మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలతో అలరిస్తున్న మెగాస్టార్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి విశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈసినిమా టీజర్ ను ఒక స్పెషల్ డేకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆరోజు మరేదో కాదు ఆగష్ట్ 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక అదే రోజు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రాావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























