చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా అలనాటి రామచంద్రుడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాపై అంత ఆసక్తి పెరగడానికి.. క్రేజ్ ఏర్పడానికి కారణం ఈసినిమా దిల్ రాజు కూడా భాగమవ్వడమే. దిల్ రాజు నుండి సినిమా వస్తుందంటే ఆసినిమాలో ఖచ్చితంగా మ్యాటరుంటుందని.. మినిమమ్ గ్యారెంటీ ఉంటుందని అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఏపీ, తెలంగాణ రిలీజ్ హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమా మోక్ష హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిన, చైతన్య గరికిపాటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. శశాంక్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























