టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్‌లో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అలాగే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టిస్తోంది.
ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో సైతం ఈ మూవీ పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం మరో కొత్త రికార్డును సృష్టించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి 7,031,645 డాలర్లు (రూ. 1,46,99,405) వసూలు చేసింది. తద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి దక్షిణ భారత చిత్రంగా కల్కి నిలిచింది. ఈ మేరకు విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























