భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో అనంత్ ఇరు కుటుంబాల సాక్షిగా రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. సతీమణి ఉపాసనతో కలిసి ఆయన కళ్యాణ వేదిక వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తరువాత రామ్ చరణ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో చరణ్ దంపతులను ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. అయితే అంతకుముందు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఆరంభ కార్యక్రమంలో కూడా రామ్ చరణ్ దంపతులు పాల్గొన్న విషయం తెలిసిందే.
కాగా జూలై 12-14 తేదీలలో మూడు రోజులపాటు వీరి కళ్యాణ వేడుకలు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నిన్న ముఖ్య ఘట్టమైన ‘శుభ్ వివాహ్’ జరుగగా.. శనివారం ‘శుభ్ ఆశీర్వాద్’, ఆదివారం ‘మంగళ్ ఉత్సవ్’ నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటీ,నటులతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























