తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు విక్రమ్ నుండి వస్తున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ మాత్రం కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రేపు అంటే జులై 10వ తేదీన ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























