సరిపోదా శనివారం-చారులత డబ్బింగ్ మొదలు

priyanka mohan starts dubbing for saripodhaa sanivaaram movie

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే రీసెంట్ గానే నాని సెకండ్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో చారులత అనే పాత్రలో నటిస్తుంది. పోలీస్ గెటప్ లో ఉన్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంది. ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు ప్రియాంక తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

కాగా ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై  నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.