టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ రూ. 700 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలయింది. బెనిఫిట్ షోలతోనే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ క్రమంలో ఇటీవలే రూ.900 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన కల్కి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పెషల్ పోస్ట్ పెట్టారు.
అందులో.. ‘కల్కి నా మనసు దోచేసింది. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ నీ ఫ్యూచరిస్టిక్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండంగా ఉంది. అమితాబ్ బచ్చన్ సర్.. మీ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ సర్.. మీరు ఏ పాత్ర పోషించినా మీదైన నటనతో ప్రత్యేకత చూపుతారు. ప్రభాస్ మరోసారి గొప్ప క్యారెక్టర్లో ఎంతో ఈజ్‌గా నటించేశావు. దీపికా పదుకొణె ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ఇంతటి అద్భుత విజయాన్ని అందుకున్న వైజయంతీ సంస్థకి, కల్కి చిత్ర బృందానికి అభినందనలు” అని పేర్కొన్నారు.
ఇక ఈ పోస్ట్‌కు డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ‘థాంక్స్ సర్.. మీ నుంచి అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’ అని బదులిచ్చారు. కాగా ప్రస్తుతం కల్కి 2898 AD సినిమాపై మహేష్ బాబు పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి గ్లోబల్ రేంజ్ మూవీ తీయనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























