పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. జూన్ 27న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్ అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా ఓవర్‌సీస్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదేక్రమంలో నార్త్ ఇండియాలోనూ కల్కి మూవీ అదరగొడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది హిందీలో తొలిరోజు వసూళ్ళలో అత్యధిక నెట్ అందుకున్న రెండో సినిమాగా రికార్డ్ సృష్టించిన కల్కి బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తుండటం విశేషం.
కాగా ఈ చిత్రం అక్కడ సుమారు 1,000 స్క్రీన్‌లలో ప్రదర్శించబడుతుండటం గమనార్హం. ఫస్ట్ వీకెండ్‌లో అదరగొట్టిన కల్కి సెకండ్ వీకెండ్‌లోనూ సత్తా చాటింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా శుక్రవారం రూ.9.75 కోట్లు, శనివారం రూ.17.50 కోట్లు నెట్ అందుకుంది. ఇక ఆదివారం ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం 11 రోజుల్లో రూ. 212.50 కోట్లు నెట్ అందుకుని సరికొత్త రికార్డ్ సాధించింది.
తద్వారా 2017లో ‘బాహుబలి 2’, మరియు 2022లో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రూ. 200 కోట్ల మార్క్ అందుకుని హిందీలో డబ్ చేయబడిన మూడవ తెలుగు చిత్రంగా కల్కి నిలిచింది. బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రభాస్ రెండవ చిత్రంగా కూడా నిలిచింది. కాగా అంతకుముందు ప్రభాస్ నుంచి వచ్చిన బాహుబలి పార్ట్ 1, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మరియు సాలార్ హిందీ వెర్షన్‌ల లైఫ్ టైమ్ బిజినెస్‌ను కల్కి క్రాస్ చేసింది.
కాగా కల్కి చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























