డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

double ismart movie count countdown started

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.  ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ బిజీగా ఉండగా..ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా కౌండ్ డౌన్ స్టార్ట్ మొదలయిందని తెలుపుతూ.. రిలీజ్ కు 40 రోజులు మాత్రమే ఉందని తెలియచేస్తూ రామ్ ఇంకా సంజయ్ దత్ కలిసి ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్‌ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.