డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఆయన నేడు విడుదలైన ‘కల్కి 2898 AD’ చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్.. “ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన మరియు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది! కల్కి 2898 AD టీమ్ మొత్తానికి అభినందనలు! ప్రభాస్ గారిని, సీనియర్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పదుకొణెను బిగ్ స్క్రీన్ పైన చూడడానికి ఇక వేచివుండలేను” అని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్. అతని దూరదృష్టి మరియు అంకితభావం ఈ పురాణ కథకు ప్రాణం పోశాయి. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచిన నిర్మాతలు అశ్విని దత్ గారు, ప్రియాంక దత్, మరియు స్వప్నా దత్ లకు వందనం. ఈ చిత్రం భారతీయ సినిమాకు ఒక మైలురాయి మరియు దాని గ్లోబల్ సామర్ధ్యానికి నిదర్శనం” అని హీరో మంచు మనోజ్ పేర్కొన్నారు.
కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక విడుదలకు ముందే అనేక రికార్డులు క్రియేట్ చేసిన కల్కి బాక్సాఫీస్ వద్ద తొలిరోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో సత్తా చూపిస్తోంది. ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























