మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ చివరి దశకు చేరనుంది.ఆగస్టులోపు సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈసినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానుంది.ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.జనవరి 10న విశ్వంభర థియేటర్లలోకి రానుంది.
ఇక చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను ఫైనల్ చేసే పనిలో వున్నాడు.ఇందుకోసం చిరుకి కథ చెప్పి ఒప్పించడానికి పలువురు డైరెక్టర్లు పోటీ పడుతున్నారట.మరి చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఎవరికి ఇస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























