వారితో నటించాలని ఉంది-రాశీ ఖన్నా

raashi khanna desire to work with prabhas and mahesh-babu

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ తెలుగులో పలు సూపర్ హిట్లను అందుకుంది. ఆ తరువాత తమిళ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలు దక్కించుకొని గోల్డెన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఇలా తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రాశీఖన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక డికేడ్ ను పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీఖన్నా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. ఈనేపథ్యంలో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ నాకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వర్క్ చేయాలని ఉంది.. ఈ విషయం ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను.. మా పెయిర్ స్క్రీన్ పై బాగుంటుందని నేను అనుకుంటున్నాను.. ఇంకా ప్రభాస్ తో కూడా కలిసి పని చేయాలని ఉంది.. కల్కి ట్రైలర్ చూశాను.. చాలా బాగా చేశాడు..సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అంటూ తెలియచేసింది. మరి రాశీకి వారితో నటించే అవకాశం త్వరలో వస్తుందేమో చూద్దాం..

కాగా రీసెంట్ గానే అరణ్మనై 4 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రాశీ ఖన్నా. ప్రస్తుతం రాశీ పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. ద సబర్మతి రిపోర్డ్ అనే సినిమా తలకోన్ మైన్ ఏక్ అనే సినిమాల్లో నటిస్తుంది. ద సబర్మతి రిపోర్ట్ సినిమా 2002 లో సబర్మతి ఎక్స్ ప్రెస్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.