మచ్ అవైటెడ్ ప్రభాస్ కల్కి 2898 ఏ డి మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.సినిమాకు హైప్ అయితే మాములుగా లేదు.ప్రమోషన్స్ ఎక్కువగా చేయకున్నా ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.బుక్ మై షో లో మొదటి రోజుకు షోస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్ల కలెక్షన్స్ 4 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా చూస్తే మొదటి రోజు గ్రాస్ 170 నుండి 180కోట్ల మధ్య ఉండనుంది.టాక్ కనుక పాజిటివ్ గా ఉంటే 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటివరకుఇండియన్ మూవీస్ లో 223 కోట్ల తో ఆర్ ఆర్ ఆర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా మొదటి స్థానంలో వుంది.217 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో వుంది.తెలుగు రాష్ట్రాల్లో కల్కికి టికెట్ హైక్స్ తోపాటు స్పెషల్ షోస్ పర్మిషన్ రావడం అడ్వాంటేజ్ కానుంది.
ఇక నైజా లో అయితే కల్కి ఆల్ టైం రికార్డు పెట్టెలానే వుంది.ఈ ఏరియాలో 35కోట్ల ఓపెనింగ్ ను రాబట్టుకునే ఛాన్స్ వుంది.ఇంతకుముందు ఆర్ ఆర్ ఆర్ నైజాం లో 33కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.ఇక తెలుగు రాష్ట్రాల్లో కల్కి బ్రేక్ ఈవెన్ కావాలంటే 180కోట్ల షేర్ ను రాబట్టాల్సిందే.మరి కొన్ని గంటల్లో కల్కి టాక్ కూడా బయటికి రానుంది.సో రిజల్ట్ ఏంటో తేలిపోనుంది.నాగ్ అశ్విన్ ఈసినిమా ను డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























