టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు ఆయన సతీమణి రమా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అకాడమీ నుంచి వారికి ఆహ్వానం అందింది. దర్శకుల విభాగంలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో రమా రాజమౌళి ఆహ్వానం అందుకున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆస్కార్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మొత్తం 57 దేశాలనుంచి 487 మంది కళాకారులు మరియు ఎగ్జిక్యూటివ్‌లకు ఆహ్వానాలు పంపింది. ఇక రాజమౌళి దంపతులతోపాటు ఆస్కార్ అవార్డ్ వరించిన ‘నాటు నాటు’ పాటకు (ఆర్ఆర్ఆర్) కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రేమ్ రక్షిత్‌ని ‘ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీ’ శాఖలో ఆహ్వానించారు.
అలాగే గతేడాది బాలీవుడ్ సీనియర్ నటి, ఐదుసార్లు జాతీయ అవార్డు విజేత షబానా అజ్మీ, నిర్మాత రితేశ్ సిద్వానీ ఉన్నారు. ఇక కొత్తగా ఇన్విటేషన్ అందుకున్నవారిలో 71 మంది ఆస్కార్ నామినీలు ఉన్నారు. మరో 19 మంది ఆస్కార్ విజేతలు కూడా ఉన్నారు. ఈ మేరకు అకాడమీ కొత్త సభ్యులను తన వెబ్సైట్లో ప్రకటించింది. ఈ సందర్భంగా.. “ఈ ఏడాది కొత్త సభ్యులకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా గల ట్యాలెంటెడ్ ఆర్టిస్టులకు మరియు నిపుణులకు అకాడమీకి స్వాగతం” అని పేర్కొంది.
ఈ అవకాశం దక్కించుకున్న భారతీయుల్లో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ (జపాన్, పొన్నియన్ సెల్వన్), చిత్రనిర్మాత రిమా దాస్ (విలేజ్ రాక్‌స్టార్స్), భారతదేశంలో జన్మించిన కెనడియన్ ఫిల్మ్ మేకర్, అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఎ టైగర్’ దర్శకుడు నిషా పహుజా, చిత్రనిర్మాత హేమల్ త్రివేది (అమాంగ్ ది బిలీవర్స్, సేవ్ ఫేస్) తదితరులు ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























