మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక్కోక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ ను గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై అడుగగా.. గేమ్ ఛేంజర్ సినిమా దాదాపు పూర్తయింది.. ఇంకా పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.. ఇండియన్ 2 రిలీజ్ తరువాత గేమ్ ఛేంజర్ మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తా.. ఆ తరవాత ఫైనల్ ఫూటేజ్ ను లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేస్తా.. ఒక్కసారి అన్ని పనులు పూర్తి చేసిన తరువాత అప్పుడు డెసిషన్ తీసుకుంటాం.. కానీ వీలైనంత త్వరగానే సినిమాను రిలీజ్ చేయడానికి చూస్తాం అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































