పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ-ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన ‘భైరవ ఆంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్‌గా టాప్ చార్ట్‌లో వుంది.
వీటితోపాటుగా ఇటీవలే విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇదిలావుండగా, కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కు శుభవార్త అందింది. తెలంగాణలో టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
దీనిప్రకారం.. తెలంగాణలో టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.75 వరకు పెంచుకునే వెసులుబాటు మేకర్స్‌కు లభించింది. దీంతో సింగిల్ స్క్రీన్‌లో రూ.265, అదే మల్టీప్లెక్స్‌లో రూ.413గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఇక ఈ ధరలతో పాటు అదనంగా టాక్స్‌లు ఉంటాయి. అలాగే ఉదయం ఐదున్నర గంటలకు బెనిఫిట్ షోలను స్క్రీనింగ్ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
కాగా ఈ బెనిఫిట్ షోస్‌కు సింగిల్ స్క్రీన్‌లో రూ.377, మల్టీప్లెక్స్‌లో రూ.495గా టికెట్ ధరలు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 8 రోజులపాటు ఈ పెరిగిన ధరలతో కల్కి మూవీ స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే.. జూన్ 27 నుంచి జూలై 4 వరకు ఈ టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారికంగా జీవో జారీ చేసింది. దీంతో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























